ఘనంగా పేరాల శేఖర్జీ షష్టి పూర్తి వేడుకలు
బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్జీ షష్టి పూర్తి వేడుకల ఘనంగా జరిగాయ్. ఈ కార్యక్రమానికి మిత్రులు, అభిమానులతోపాటు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధరరావు, బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల మధ్య షష్టిపూర్తి నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు పేరాల శేఖర్జీ. కార్యకర్తల చూపిన అభిమానానికి… యావత్ తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారాయన. ప్రజల కోసమే ఈ జీవితం అంకితమన్నారు శేఖర్జీ. మెరుగైన సమాజం కోసం రాజకీయ రంగంలో బీజేపీ సామాన్య కార్యకర్త స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదగానన్న శేఖర్జీ… ప్రజలకు సేవ చేయడంలోనే ఆనందం ఉందన్నారు.