“ఏపీలో పండగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి”:సీఎం జగన్
ఇటీవల సీఎం జగన్ ఏపీలో పెన్షన్లు పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఏపీలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వైస్సార్ పెన్షన్ కానుక రూ.3000లకు పెంటుతున్నట్లు సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. కాగా పెంచిన పెన్షన్లు జనవరి 1 నుండి 8వ తేది వరకు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని సీఎం తెలిపారు. ఏపీలో గత ప్రభుత్వాలు రూ.1000 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారన్నారు.కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దానిని రూ.2250కు పెంచామన్నారు.అయితే ఇప్పుడు దానిని మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రూ.3000 వేలకు పెంచుతుందని సీఎం వెల్లడించారు. కాగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఈ స్థాయిలో పెంచ లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఓ పండగలా చేపట్టాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

