కేంద్ర సహాయమంత్రిగా పెమ్మసాని బాధ్యతల స్వీకరణ
గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు కేంద్రంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రి పదవి దక్కింది. ఈ మేరకు ఆయన ఈ రోజు కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ,ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కేంద్ర ప్రభుత్వం తనకు అప్పగించిన గ్రామీణాభివృద్ధి,కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా సమర్ధవంతంగా పనిచేస్తానన్నారు. మొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పటికీ భారీ మెజారిటీతో తనను గెలిపించిన గుంటూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

