కాపులకు కోపం తెప్పించేలా పవన్ కళ్యాణ్ తీరు
ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి తీరాల్సిందే అంటూ మాజీ మంత్రి వృద్ధ నాయకుడు హరిరామజోగయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం విరమించారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు దీక్ష విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్ పై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. కానీ ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేయడం సాధారణంగా జరిగే జరిగే విషయమే. ఐతే ఆస్పత్రికి తరలించినా అక్కడ కూడా దీక్ష చేసి తీరుతానని ఈ 85 ఏళ్ల వృద్ధ నాయకుడు చాలా పట్టుదలతో చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు ఎత్తని అందరూ అంటున్నారు. గతంలో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ తొలి రోజుల్లో హరిరామజోగయ్య చాలా అండగా ఉన్నారు. ఒకే సామాజిక వర్గం కావడం వల్ల పవన్ కల్యాణ్ కు కూడా ఎంతో అండగా ఉండేవారు. పవన్ కల్యాణ్ పట్ల ఇప్పటికీ అభిమానంతోనే ఉంటారు. అలాంటి హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్షచేస్తోంటే పవన్ కల్యాణ్ స్పందించిన తీరు చాలా చిత్రంగా ఉంది. కాపులకు కోపం తెప్పించేలా కూడా ఉందన్న విమర్శలు కాపు సామాజికవర్గం నుంచి విన్పిస్తున్నాయి.

కాపులకు రిజర్వేషన్లు తక్షణం ఇచ్చి తీరాల్సిందేనన్నప్పుడు పవన్ కల్యాణ్ తన నోటితో ఆ డిమాండ్ వినిపించవచ్చు కదా.. కానీ, అలా ఎందుకు చేయలేదని కాపులు ప్రశ్నిస్తున్నారు. తన నోటితో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ పవన్ కల్యాణ్ పొరబాటున కూడా అనరని అంటున్నారు. తనమీద కాపునాయకుడనే ముద్ర వేస్తారనే భయం పవన్ కల్యాణ్‌లో ఉందంటున్నారు. తనే అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదనే మహాభయం ఉందంటున్నారు. ఈ కారణాల వల్ల ఆయన కాపులకు ఫేవర్ గా తాను మాట్లాడరని అభిప్రాయపడుతున్నారు. అందుకే జోగయ్య దీక్ష చేస్తానంటే ప్రభుత్వం స్పందించాలని అంటున్నారంటున్నారు. ముద్రగడ పద్మనాభానికి కాపుల్లో ఉన్న ఆదరణను దారి మళ్లించేందుకు ఇలా జనసేన ముసుగులో చంద్రబాబు ప్లాన్ తో జోగయ్యతో దీక్ష చేయిస్తున్నారని అభిప్రాయాన్ని కూడా కొందరు కాపు నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాపులపై ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ దీక్ష చేయవచ్చు కదా అని ఒక వర్గం ఆరోపిస్తుంది.

