సెజ్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
అచ్యుతాపురం సెజ్ ప్రమాదం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రమాదం చాలా బాధ కలిగించిందని, యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలోనే పలుమార్లు చెప్పానని పేర్కొన్నారు. ఇలాంటి పరిశ్రమలలో కార్మికుల భద్రత కోసం తగిన ఏర్పాట్లు, అగ్నిప్రమాదాల నియంత్రణకు భద్రతా చర్యలు ఉండాలని సూచించారు. ఇలా ప్రతీ వారం ప్రమాదం జరగడం, సంతాపం తెలిపి, పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రమాదాలకు మూలాలు కనిపెట్టి, నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

