“పవన్ కళ్యాణ్ ఓ పిచ్చి కుక్క”: వైసీపీ మంత్రి
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రగడ ప్రారంభమైనట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు జనసేన ,టీడీపీ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఏపీ మంత్రి జోగి రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు ఓ చిత్తకార్తె కుక్కలాగా మొరుగుతున్నారన్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పిచ్చి కుక్క అని మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. పెళ్లాలను,పార్టీలను తరుచూ మారుస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. లోకేశ్‌ను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. లోకేశ్ ఓ ఊరపంది అని సంభోదించారు. అయితే సీఎం జగన్ సింహం అన్నారు. కాగా లోకేశ్ స్థాయి ఏంటి?జగన్‌తో లోకేశ్‌కు పోలికేంటి?అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎంత మంది వచ్చినా జగనన్నని ఏమి చేయలేరని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.అయితే మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఇటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగించడంపై జనసేన నాయకులు, నేతలు, జనసైనికలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

