త్వరలోనే సీఎంగా పవన్ కల్యాణ్… నాగబాబు సంచలన వ్యాఖ్యలు
శ్రీకాకుళం రణస్థలంలో జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పాల్గొన్నారు. ఆయన చేసిన పలు కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయ్.
యువత సోషల్ మీడియాకు పరిమితం అవుతోంది. ఇది మంచిది కాదు.
చాలా తక్కువ మంది యువకులు రాజకీయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇది దేశానికి మంచిది కాదు.
యువతీ, యువకులు రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి
రాజకీయాలు ఇంటరెస్ట్ లేదనుకుంటే కుదరదు. రాజకీయాలు మీ గురించి ఆలోచిస్తాయి. ప్రభావితం చేస్తాయి. మిమ్మల్ని బాగు చేస్తాయ్. అనేక రకాలుగా పట్టించుకుంటాయ్. నిత్య జీవితంలో ప్రతి పనిలోనూ రాజకీయాలు చోటు చేసుకుంటాయి.

రాజకీయాలు గురించి యువత పట్టించుకోకపోతే అసమర్థులైన నాయకుల నియంతృత్వం, ఆధిపత్యం అణిచివేస్తుంది. భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది..
దుర్మార్గమైన రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే పరిసరాలను, మీ భవిష్యత్‌ను, మీ పిల్లల భవిష్యత్‌ను తరతరాలను దోచుకుతింటారు. అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవాలి.
యువత కోసం ఓ రాజకీయ వేదిక ఏర్పాటు చేసిన ఘనత పవన్ కల్యాణ్‌ది. జనసేనలో యువశక్తిది ప్రాముఖపాత్ర
జనసేన కుటుంబ పార్టీ కాదు. కుల పార్టీ కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు పార్టీలో సమా ప్రాధాన్యం
కల్యాణ్ లాంటి నాయకుత్వ లక్షణాలున్న వారిదే జనసేన పార్టీ

కుటుంబపరంగా నేను రాజకీయాలు చేయడం లేదు. బ్రదర్‌గా జనసేన నిర్మాణంలో మాత్రమే పాల్గొంటాను. వచ్చే అధికారంలో నాకు పాత్ర ఉండదు. జనసేన కుటుంబ పార్టీ కాదు
పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడు. ముఖ్యమంత్రి అవుతాడు. ఇది తధ్యం.
జనసేన పార్టీలోనే ఒక ప్రత్యేకత ఉంది. సామాన్య కార్యకర్త నుంచి ఎవరైనా సీఎం కావొచ్చు… ఏ కులం వారైనా, మతాలకు అతీతంగా సీఎం అయ్యేందుకు ఏకైక ఆప్షన్ జనసేన పార్టీ
మేం చూస్తాం.. మేం చూస్తాం… మీ నియంత్రత్వ పోకడలున్న ప్రభుత్వ పతనాన్ని చూస్తాం. మేం చూడటం తధ్యం తారాస్థాయికి చేరిన క్రూరత్వం, పతనం మేమందరం చూస్తాం. మీ పతనాన్ని చూస్తాం.. మంటూ పాక్ అధ్యక్షుడిగా జియావుల్ హక్ ఉన్న సమయంలో వచ్చిన నినాదాన్ని ప్రఖ్యాత కవిత ఫయాద్ అహ్మద్ రాశారు. అదే ఇప్పుడు వైసీపీ సర్కారును కూల్చేస్తుంది.

పోలీస్ వ్యవస్థను ఏకపక్షంగా వాడుకుని ప్రజలను హింసించే నియంతలకు, జియావుల్ హక్ గతే పడుతుంది.
ముఖ్యమంత్రి విద్యావంతుడు కాకపోవడం వల్ల చరిత్ర చదివే అవకాశం లేకుండా పోయింది… ఒకరు చెప్తే వినేవాడు కూడా కాదు… ఆలోచన తప్ప, సమాలోచన ఆయన నిఘంటువులే లేనేలేదు.
ఫ్యాక్షన్ కుటుంబానికి ప్రజాస్వామ్యం కన్పించదు. బాబాయ్ హత్య అందుకే తప్పుగా కన్పించడం లేదు
పోలీస్ లేకుంటే గడపదాటి బయటకు రాలేని పరిస్థితిలో… ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను చిత్తు చేస్తే చాలనుకుంటున్న పాలన ఇది…
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఆపడమే జీవో నెంబర్ 1 లక్ష్యం, స్వాతంత్ర్య చరిత్రలో ఇలాంటి చట్టం ఏ ప్రభుత్వం తేలేదు. ప్రజలకు న్యాయస్థానాలు అండగా నిలబడతాయి.
సమాజ శ్రేయస్సు తప్ప. స్వార్థం తెలియని రాజకీయనేత కాబట్టి పోలీస్ విజ్ఞప్తితో విశాఖ గదిలో బందీగా నిలిచాడు. లేదంటే ఆ రాత్రి హోటల్ గది దాటి వీధుల్లోకి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న జనం ముందు చేతులు కట్టుకు నిలబడి ఉంటే… ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అరాజకీయ విషసర్పాలు, ప్రజాగ్రహమనే, మంటల్లో ఆ రోజే మాడి మసయ్యేవి…

