Andhra PradeshHome Page Slider

“ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్”: సీఎం

ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు సభలో స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి అయ్యన్న పాత్రుడుకి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి సభాపతి సీట్లో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి పవన్  వారికి గట్టి సమాధానం ఇచ్చారన్నారు. కాగా ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని సీఎం కొనియాడారు. ఇక రాష్ట్రంలో ప్రజల జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని సీఎం సభ్యులకు చెప్పారు. కాగా ఈ సభను అత్యున్నత ,గౌరవప్రదమైన సభగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు.