సినిమాలపై పవన్ గ్రీన్‌సిగ్నల్..కానీ ఒక్క కండిషన్
ఎట్టకేలకు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల ప్రచారం మొదలుకొని, బిజీగా రాజకీయాలలో తిరుగుతున్న పవన్ సినిమాలకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 22 నుండి వీరమల్లు న్యూ షెడ్యూల్ మొదలవుతుందని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ చిత్రంతో పాటు ఓజి చిత్రానికి కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఒక్క కండిషన్ పెట్టారట పవన్. అదేంటంటే మంగళగిరి పరిసరాలలోనే షూటింగు జరపాలని పేర్కొన్నారట. దీనికి అంగీకరించిన నిర్మాతలు షూటింగుకు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్.

