దక్షిణాదిలో రికార్డు సృష్టించిన “పఠాన్”
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ,దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం “పఠాన్”. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇటీవల కాలంలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలోను భారీ కలెక్షన్లతో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా నైజాం /ఆంధ్రాలో రూ.50 కోట్లు వసూలు చేసిన మొదటి హిందీ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా రూ.70 కోట్లు వసూలు చేసిన రెండవ దక్షిణేతర చిత్రంగా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ సినిమా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ భారీ సక్సెస్‌తో పఠాన్ చిత్ర దర్శక ,నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.కాగా ఈ పఠాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

