NationalNewsNews Alert

కాషాయం గూటికి పన్నీర్ సెల్వం ? 

Share with

అన్నడీఎంకే నాయకత్వ విషయమై నెలకొన్న పోరు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా మెన్న జరిగిన ఓపీఎస్ వర్గం ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్‌లో ప్రధాని మోదీ , అమిత్ షా ఫోటోలు ఉండటం మరొ కొత్త రాజకీయ కథకు తెరలేపింది. ఈ ఫోటోల పై అనేక అభిప్రాయలు వ్యక్తమవితున్నాయి. దానిలో భాగంగానే , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భాజపాలో చేరనున్నరని కొన్ని ఊహగాణాలు వెలువడుతున్నాయి. వీటిని నిజం చేసేలా  చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవం కోసం మోదీ చెన్నై వచ్చిన రోజే  పన్నీర్ వర్గం హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం గవనించదగ్గ విషయం. అన్నడీఎంకేలో గత కొద్దికాలంగా నాయకత్వ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రాజకీయ పోరులో పన్నీర్ సెల్వంపై మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి నెగ్గగా , ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. ఈయన హయంలో పార్టీలో కొన్ని కీలక మార్పలు చేసారు. అన్నడీఎంకే సమన్వయకర్తల పదవులను రద్దుచేయడంలో పాటు పన్నీర్ సెల్వం , ఆయన మద్దతుదారులను కూడా పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు సమావేశంలో ఓ ప్రత్యేక తీర్మానం ఆమోదించారు.

ఈ తీర్మానాన్ని ఖండించిన పన్నీర్ సెల్వం , తనను పార్టీ నుండి తొలగించే అధికారం ఎవరికి లేదని..కేపి మునుస్వామిని , పళనిస్వామిని తానే స్వయంగా పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా తానే సమన్వయకర్తనని చేప్తూ పార్టీలో కొన్ని పదవులకు నియామకాలు కూడా చేస్తున్నారు. దీనిపై స్పందించిన పళని స్వామి , పన్నీర్ చేసిన నియామకాలు చెల్లవని స్పష్టం చేసారు. అయితే తనను పార్టీ నుండి బహిష్కరించడాన్ని ఖండిస్తూ కోర్టులో పిటిషన్ వేసిన సెల్వం దీనిపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ సర్వోన్నత న్యాయస్ధానం ఇందులో జోక్యం చేసుకునెందుకు నిరాకరిస్తూ , పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లో తీర్పు ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆదేశించింది.