శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ సిగరెట్ల పట్టివేత
విదేశాల నుంచి అక్రమంగా సిగరెట్లను తరలిస్తున్న ముఠా కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది.అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టిన అక్రమ రవాణకు అడ్డుకట్ట పడడం లేదు. అక్రమ రవాణ మాత్రం ఎదో ఒక విధంగా కొనసాగుతూనే వుంది. కొద్ది రోజుల క్రితం రెండు దఫాలుగా కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. అయిన అక్రమ రవాణకు పాల్పడ్డారు కొందరు కేటుగాళ్ళు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుండి 6E-1406 ఇండిగో విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆరుగురు ప్రయాణికులపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. వారి లగేజీ బ్యాగులలో విదేశీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని బ్యాగులో ఉన్న 22600 సిగరెట్లు, 940 ఈ -సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 11.66 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఆరుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.