పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
అణ్వాయుధ దేశం పాలనలో అసాధారణమైన ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్న ఆర్మీకి చీఫ్‌గా… లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను పాకిస్తాన్ గురువారం నియమించింది. పాకిస్తాన్ ప్రధాన గూఢచారి అయిన మునీర్, ఆరేళ్ల పదవీకాలం తర్వాత ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న జనరల్ కమర్ జావేద్ బజ్వా నుండి బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సైన్యం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య వివాదం ఉధృతమవుతున్న తరుణంలో మునీర్ నాయామకం జరగడం సంచలనంగా మారింది. ఈ ఏడాది ఆరంభంలో ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ను సాగనంపడంలో ఆర్మీ కీలక పాత్ర పోషించింది. మునీర్‌ను కొత్త చీఫ్‌గా ప్రకటించిన తర్వాత రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విలేకరులతో మాట్లాడారు. మెరిట్, చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించి నియమించిట్టుగా ప్రకటించారు.

పాకిస్తాన్ సైన్యం దేశీయ, విదేశీ రాజకీయాలలో పెద్ద పాత్ర పోషిస్తూ వస్తోంది. మునీర్ నియామకం పాకిస్తాన్ దుర్బలమైన ప్రజాస్వామ్యం, పొరుగున ఉన్న భారతదేశం, తాలిబాన్-పాలిత ఆఫ్ఘనిస్తాన్‌తో దాని సంబంధాలను అలాగే చైనా, యునైటెడ్ స్టేట్స్ సంబంధాలపై పెను ప్రభావం చూపుతుంది. ఈనెల 29న పదవీ విరమణ పొందనున్న ఆర్మీ చీఫ్ బజ్వా మాట్లాడుతూ, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో సైన్యానికి ఎటువంటి పాత్ర ఉండదని స్పష్టం చేశారు. అమెరికా మద్దతుతో కూడిన కుట్ర తన ప్రభుత్వానికి కూలదోసిందన్న అభిప్రాయాన్ని ఇమ్రాన్ ఖాన్ పదేపదే ఆరోపించడం దారుణమన్నారు. ఆ విమర్శలు పసలేనివని… నకిలీవని, తప్పుడవంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఈ నెల ప్రారంభంలో తుపాకీ దాడిలో గాయపడిన ఇమ్రాన్ ఖాన్, ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూపోతున్నారు. సైన్యం ప్రధాన కార్యాలయానికి నిలయంగా ఉన్న రావుల్పిండిలో శనివారం నిరసనకు నాయకత్వం వహించాలని యోచిస్తున్నారు.

