తప్పు ఒప్పుకున్న పాకిస్తాన్..మన నష్టాలకు భారత్ కారణం కాదు
ఎట్టకేలకు పాకిస్తాన్ తన తప్పు ఒప్పుకుంది. తమ దేశ ఆర్థిక నష్టాలకు మన సైనిక ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తమ దేశంలోని ప్రజలు పడుతున్న ఆర్థిక సమస్యలకు, కష్టనష్టాలకు భారత దేశమో, అమెరికానో కారణం కాదన్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న సైనిక ప్రభుత్వమే కారణమని విమర్శించారు. చివరికి ఆఫ్గానిస్తాన్‌లోని అనిశ్చితి కూడా కారణం కాదన్నారు. మన కాళ్లను మనమే కాల్చుకున్నామని, మన ఆర్థిక వ్యవస్థను మనమే కూలగొట్టుకున్నామని పేర్కొన్నారు. 2018 ఎన్నికలలో బలవంతపు ప్రభుత్వాన్ని మనపై రుద్దారని వాపోయారు. ఇప్పటికే మూడుసార్లు ప్రధాని పదవిని అలంకరించిన ఆయన తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (PMLN) తరపున అభ్యర్థులుగా పోటీ చేయబోయే వారితో కలిసి సమావేశమయ్యారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి న్యాయమూర్తులు సైనిక నియంతలకు మద్దతు పలికారని, వారి పాలనకు చట్టబద్దత కల్పించారని విమర్శించారు. 2017లో తనను అధికారం నుండి తొలగించడానికి ఐఎస్‌ఐ మాజీ అధినేత జనరల్ ఫయాజ్ హమీద్ ఇలాగే వ్యవహరించారని, ఇలాంటి చర్యల వల్లే పాకిస్తాన్‌కు ఇలాంటి అధోగతి పట్టిందన్నారు నవాజ్ షరీఫ్.

