Home Page SliderTelangana

ఓవర్ టు ఢిల్లీ, హస్తినకు డీకే శివకుమార్ సహా, కాంగ్రెస్ ముఖ్యులు

తెలంగాణ సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీలో చర్చలు సాగుతున్నాయ్. ఇవాళ సీఎం ప్రమాణస్వీకారం అంటూ తొలుత వార్తలు వచ్చినా.. ఏకాభిప్రాయం కోసం నేతలు ఢిల్లీ బాట పట్టారు. సీఎం ఎంపిక విషయాన్ని హైకమాండ్ కు అప్పగిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టగా.. పార్టీ ముఖ్యనేతలంతా ఆమోదించారు. దీంతో ఇప్పుడు సీఎం ఎంపిక వ్యవహారాన్ని హైకమాండ్ పెద్దలు తేల్చనున్నారు.