నా పని మాత్రమే మాట్లాడుతుంది… కొత్త సీజేఐ చంద్రచూడ్
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మీడియాకు తన మొదటి ప్రకటనలో, జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ,
సాధారణ పౌరుడికి సేవ చేయడమే నా ప్రాధాన్యత, రిజిస్ట్రీ మరియు న్యాయ ప్రక్రియలో సంస్కరణలకు హామీ ఇస్తున్నానన్నారు చంద్రచూడ్. పని కన్పించాలి… మాటలు కాదన్నారు. జస్టిస్ చంద్రచూడ్ రెండు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు సీజేఐగా వ్యవహరిస్తారు. నవంబర్ 10, 2024 వరకు పదవిలో ఉంటారు.

