5 అంగుళాల పొడవు పెరిగేందుకు కోటి 40 లక్షలు.. మ్యాటరేంటంటే!?
పొట్టిగా ఉన్నవాళ్లకు పొడుగా అవ్వాలని, లావుగా ఉన్నవారికి సన్నగా మారాలని, వికారంగా ఉన్నవారు అందంగా తయారవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొందరు మాత్రమే అందులో సఫలమవుతుంటారు. మారుతున్న ఆహార అలవాట్లు, వర్క్ టెన్షన్లు అన్నీ కూడా కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయ్. కానీ హైట్ పెరగాలనుకున్న తన కోరికను నెరవేర్చుకోవడం కోసం అమెరికా, మిన్నెసోటాకు చెందిన ఒక వ్యక్తి ఏం చేశాడన్నది ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. తన ఎత్తును ఐదు అంగుళాలు పెంచుకోవడానికి రెండు కాళ్లకు ఆపరేషన్ కోసం సుమారు కోటి 40 లక్షలు వెచ్చించాడు 41 ఏళ్ల మోసెస్ గిబ్సన్. పొట్టిగా ఉండటం వల్ల తనపై ఎక్కువ మంది జాలి చూపించేవాళ్లని, అమ్మాయిలు కామెంట్ చేసేవారని, తనను ఎవరూ ఇష్టపడేవారు కారని చెప్పుకొచ్చాడు.
5-అంగుళాల హైట్ పెరగడం కోసం ఎంతో కష్టపడ్డాన్న గిబ్సన్.. అన్నీ ప్రయత్నాలు చేశాక మత్రమే ఆపరేషన్ వైపు మొగ్గు చూపానన్నాడు. ఎత్తును పెంచుకోవడానికి మందులు, ఆధ్యాత్మికవేత్త సలహాను తీసుకున్నానన్నాడు. గిబ్సన్ కెన్నెడీ న్యూస్ అండ్ మీడియాతో మాట్లాడుతూ, తన గురించి తనకు ఎంతో అసహనంగా ఉండేదని… అందుకే హైట్ పెరగాలని కోరుకున్నానన్నాడు. హైట్ ఉన్నట్టుగా కన్పించడం కోసం బూట్లలో కొన్ని వస్తువులను ఉంచవాడినన్నాడు. మందులు వాడితే హైట్ పెరగొచ్చన్న సలహా మేరకు కొన్నాళ్లు ప్రయత్నించానన్నాడు. కానీ హైట్ పెరగకపోవడంతో, బాధాకరమైన కాలుని పొడిగించే శస్త్రచికిత్సకు వెళ్లాలని నిర్ణయించుకున్నానన్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానూ, ఉబెర్ డ్రైవర్‌గా పని చేయడం ద్వారా మూడేళ్లలో ఆపరేషన్ కోసం $75,000, అంటే సుమారుగా 65 లక్షల రూపాయలు ఆదా చేశానన్నాడు. 2016 లో ప్రక్రియ ప్రారంభించినప్పుడు 3 అంగుళాలు హైట్ పెరిగడంతో కొంత మేరకు సంతోషంగా ఉన్నానన్నాడు.
ఐతే పూర్తి స్థాయి హైట్ పెరగడం కోసం రెండో ఆపరేషన్‌కు సిద్ధమయ్యానన్నాడు. అందుకు తగిన మొత్తాన్ని సిద్ధం చేసుకున్నానన్నాడు. 2 అంగుళాలు హైట్ పెరగడం కోసం రెండో ఆపరేషన్ కోసం $98,000 డాలర్లు, అంటే 80 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశానన్నాడు. ఆపరేషన్ తర్వాత తాను 5 అడుగుల 10 అంగుళాల హైట్‌కు చేరుకున్నాని చెప్పాడు. తన హైట్ మరో అంగుళాలు పెరిగితే ఎంతో సంతోషించేవాడనంటాడు గిబ్సన్. శస్త్ర చికిత్సల వల్ల తనకు ఎదురైన మహిళలతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నానన్నాడు. మొదటి సర్జరీ తర్వాత ఆడవాళ్ళతో మాట్లాడే సమయంలో సిగ్గు కొంత మేర తగ్గిందన్న గిబ్సన్, హైట్ పెరిగాక తనకో గార్ల్ ఫ్రెండ్ కూడా ఉందంటాడు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత శరీరం సహకరిచడం లేదని, ఎత్తు పెరిగినందున నొప్పిని ఆనందంతో భరిస్తున్నానని, డబ్బు ఖర్చు అయినందుకు బాధపడటం లేదని చెప్పుకొచ్చాడు.

