ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ
అయ్యా చంద్రబాబూ ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవ పాలన అంటూ కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదైనా మంచి పని చేశారా అయ్యా అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. సూపర్ 6 పథకాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని సూటిగా ప్రశ్నించారు.కల్తీ నెయ్యి,సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, ప్రశ్నిస్తే చావబాదడాలు ఇవి తప్ప మీ ఆర్నెల్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా అయ్యా అంటూ ఘాటుగా విమర్శించారు. అధికార దాహం తీర్చుకోవడానికి అబద్దపు హామీలిచ్చారని,ఇప్పుడు నెరవేర్చాలని నిలదీస్తుంటే కేసులు పెడుతున్నారని,ఇది మీకు ధర్మమేనా అంటూ లేఖలో ప్రశ్నించారు.

