వామ్మో ఇన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాసా!?
ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణకు గడువు ముగియడంతో అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు సింబల్స్ కేటాయించారు. రాష్ట్రంలో జనసేన కేవలం 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడంతో, పలు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసును అధికారులు కేటాయించారు. రాష్ట్రంలో జనసేన పోటీ చేయని పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు అధికారులు గాజు గ్లాసు సింబల్ ఇచ్చారు. ఇలా కేటాయించి నియోజకవర్గాల్లో చాలానే ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు
గాజు గ్లాసు కేటాయించిన ఉత్తరాంధ్ర నియోజకవర్గాలు
1) టెక్కలి
2) ఆముదాలవలస
3) విజయనగరం
4) విశాఖ తూర్పు
5) భీమిలి
గాజు గ్లాసు కేటాయించిన ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గాలు
1) పెద్దాపురం
2) కాకినాడ సిటీ
3) రామచంద్రాపురం
4) అమలాపురం
5) ముమ్మడివరం
6) రాజమండ్రి సిటీ
7) కొత్తపేట
8) జగ్గంపేట
9) మండపేట
10) కొవ్వూరు
11) పాలకొల్లు
12) తణుకు
గాజు గ్లాసు కేటాయించిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు నియోజకవర్గాలు
1) మైలవరం
2) విజయవాడ సెంట్రల్
3) విజయవాడ తూర్పు
4) మంగళగిరి
5) గన్నవరం
6) మచిలీపట్నం
7) అద్దంకి
8) పర్చూరు
9) బాపట్ల
10) చీరాల
11) పెదకూరపాడు
12) మాచెర్ల
గాజు గ్లాసు కేటాయించిన రాయలసీమ నియోజకవర్గాలు
1) శ్రీకాళహస్తి
2) కుప్పం
3) చంద్రగిరి
4) రాప్తాడు
5) తాడిపత్రి
6) గుంతకల్లు
7) ఆదోని
8) పత్తికొండ
9) కావలి
10) కమలాపురం
11) మైదుకూరు
12) రాజంపేట
13) మదనపల్లె
గాజు గ్లాసు కేటాయించిన ఎంపీ స్థానాలు
1) అనకాపల్లి
2) రాజమండ్రి
3) విజయవాడ
4) గుంటూరు
5) బాపట్ల
6) ఒంగోలు

