Horoscope TodayNews

16.10.2022 ఆదివారం మీ రాశి ఫలం

మేషం: అనుమానం, నమ్మకద్రోహం, నిరాశ, అహంభావం, అసూయ లాంటి దుర్గుణాల నుండి మీరు విముక్తి పొందుతారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీ విలువైన వస్తువులు దొంగతనం చేసే ప్రమాదం ఉంది. ఇది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపెడుతుంది. కుటుంబ సభ్యులతో మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. దీని వల్ల మనశ్శాంతి లోపిస్తుంది.

వృష‌భం: రోజంతా కష్టమైనప్పటికీ ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. ఇది ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల కోరుకున్న విధంగా వారితో గడపాలి. మీ ప్రియమైనవారిపై ద్వేషం లేకుండా ప్రేమను ప్రదర్శిస్తారు. ఖాళీ సమయంలో ఏదైనా కొత్త పని చేయాలని ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులను కలవడం ద్వారా మీ సామాజిక బాధ్యతలను నెరవేర్చవచ్చు.

మిథునం: శారీరక దృఢత్వాన్ని కాపాడుకునే కొన్ని క్రీడా కార్యకలాపాలను ఆస్వాదించే అవకాశం ఉంది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడానికి కూడా ప్రయత్నించవద్దు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా రాత పూర్వకంగా ప్రామిసరీ నోట్స్ తీసుకొని ఇవ్వండి. మీ మాట మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ప్రయాణం, వినోదం పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీకు చేదోటువాదోడుగా ఉంటారు.

క‌ర్కాట‌కం: మీ దయగల స్వభావం ఈరోజు చాలా సంతోషకరమైన క్షణాలను తెస్తుంది. ఈ రోజు, దగ్గరి బంధువు సహాయంతో, మీరు మీ వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఆర్థికంగా కూడా లాభిస్తుంది. మీ పిల్లలు కోరినట్టుగా మీరు వ్యవహరిస్తారు. మీ అపరిమితమైన ప్రేమ, మీ ప్రియమైనవారికి చాలా విలువైనది. ఈరోజు రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోష పెట్టేలా పనులను నిర్వర్తిస్తారు.

సింహం: మీ శక్తి ఎక్కువగా ఉంటుంది. అమ్మ, మేనమామ, తాతల వైపు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం బహుమతులు సంపాదించేలా చేస్తుంది. మీ బిజీ లైఫ్ మధ్య, మీరు మీ పిల్లలతో గడపడానికి సమయాన్ని వెచ్చిస్తారు. వారితో సమయం గడపడం వల్ల మీరు మిస్ అవుతున్న విషయాల గురించి తెలుసుకుంటారు.

క‌న్య : మీ గురించి మీకు మంచి అనుభూతిని కలిగించే పనులు చేయడానికి అద్భుతమైన రోజు. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్య వైఖరి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. జీవితంలో ముఖ్యం కానటువంటి విషయాలను వదిలేయడం మంచిది. వైవాహిక జీవితంలో అనవసర సమస్యలు వచ్చే విధంగా ఎవరిని ప్రోత్సహించవద్దు. ఈ రోజు మీరు చేసిన పని మీ సీనియర్లచే ప్రశంసించబడుతుంది. ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

తుల‌- ఒక విషయమై ఆశపడతారు. అప్పు తిరిగి చెల్లించేందుకు అవకాశం లభించినందున… ప్రశాంతత పొందుతారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్నేహితులుగా పొందాలనుకుంటారు. బాధ్యత తీసుకోడానికి మీకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది. మీ ఓటముల నుండి మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చికాకు పెడుతుంది. మీరు చేసే సహవాసంలో చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలో ఆలోచించుకోండి.

వృశ్చికం: అసౌకర్యం మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు. మీ సమస్యలను పరిష్కరించడానికి స్నేహితుడు చాలా సహాయకారిగా ఉంటాడు. టెన్షన్‌ని వదిలించుకోవడానికి సంగీతాన్ని వినండి. దీర్ఘకాలిక లాభాల కోసం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టువచ్చు. వినోద కార్యకలాపాలలో కొంత సమయం గడపడం వల్ల ఉత్తేజితులవుతారు. ఈరోజు మీ కోసం సమయాన్ని వెచ్చించగలరు. ఖాళీ సమయంలో మీరు కొన్ని అద్భుతాలు చేసే అవకాశం ఉంది.

ధ‌నుస్సు: మీలో శక్తి సామర్థ్యాలు ఎక్కువ. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు దాన్ని ఉపయోగించాలి. రోజు ప్రారంభంలో, మీరు ఏదైనా ఆర్థిక నష్టానికి గురవుతారు. ఇది రోజంతా చికాకు కలిగిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఈ రోజు మీకు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది.

మ‌క‌రం: మీరు మీ అభిరుచులను కొనసాగించడంలో ఎక్కువ ఆనందిస్తారు. ఇష్టమైన పనులను చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు. ఫైనాన్స్‌లో మెరుగుదల మీ దీర్ఘకాల బకాయిలు, బిల్లులను చెల్లించడానికి సౌకర్యంగా ఉంటుంది. మీరు గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొంటే కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. విలువైన బహుమతులు వల్ల మీరు సంతోషం పొందరు. ప్రయాణ సమయంలో మీ వస్తువుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభం: మీ జీవితాన్ని ఆనందమయం చేసుకునే మార్గాల వైపు చూస్తారు. ఆందోళన లేకపోవడం వల్లే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఖర్చులు ఊహించని విధంగా పెరగడం మీ మనశ్శాంతికి భంగం కలిగిస్తుంది. మీ చమత్కార స్వభావం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీ పట్ల ప్రేమను పంచుతుంది. ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. అలా చేయడం మీకు కూడా ప్రయోజనకరం. మీ సహోద్యోగులను ఆకర్షించేలా మీ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయగలుగుతారు.

మీనం: మీరు మీ శారీరక శక్తిని కాపాడుకోవడానికి ఎక్కువ సమయాన్ని ఆటలు ఆడేందుకు ఉపయోగిస్తారు. మీరు మీ పెట్టుబడుల విషయంలో శ్రద్ధగా, అప్రమత్తంగా ఉండటం మంచిది. కొందరికి కుటుంబంలో కొత్త వేడుకలు, పార్టీలతో ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ పనుల్లో సహాయపడతారు.