నుపుర్ శర్మకు ఊరట…
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన విషయం అందరికీ తెలిసిందే. నుపుర్ పై అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి విచారించాలని ఆమె సుప్రీం కోర్టును కోరారు. దీనిపై అత్యున్నత న్యాయ స్థానం సానుకూలంగా స్పందించింది. ఆమె ప్రాణాలకు హాని ఉందన్న బెదిరింపులను తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆమెపై దాఖలైన కేసులన్నిటినీ కలిపి డిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఐఎఫ్‌ఎస్‌వో యూనిట్‌కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా… దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని, అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
Read more: తరుణ్ చుగ్ అవుట్… సునీల్ బన్సాల్ ఇన్…