NationalNews Alert

కర్ణాటక సీఎం మార్పుపై బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు

Share with

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కర్ణాటక పర్యటన తర్వాత … మరోసారి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని బీజేపీలో చర్చ మొదలైంది. ఆగస్టు 15వ తేదిలోపు సీఎం బసవరాజ్ బొమ్మై స్ధానంలో మరొకరిని సీఎం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మార్పు గురించి మాట్లాడుతున్నవారిలో బీజేపీ నాయకుడు బసన గౌడ పాటిల్ కూడా ఉన్నారు. బీఎస్ యడియూరప్ప స్థానంలో బొమ్మైని ముఖ్యమంత్రి చేస్తున్నారని బసనగౌడ గతంలో అంచన వేశారు. ఏడాది తర్వాత బసనగౌడ అంచనాలే నిజమయ్యాయి. పాటిల్ తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తర్వలో పార్టీకి మేలు జరిగే నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. పాటిల్ మాటలను బి. సురేశ్ గౌడ ఏకీభవించారు. దీంతో బొమ్మైకి ఉద్వాసన తప్పదనే సంకేతాలిచ్చినట్టయింది.


మరోవైపు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కూమార్ కతీల్ ఈ వార్తలను కొట్టిపారేశారు. సీఎం బసవరాజ్ బొమ్మై తన పదవి కాలన్ని పూర్తి చేస్తారని వెల్లడించారు. దక్షిణ కన్నడ జిల్లీలో జరిగిన బీజేపీ యూత్ వింగ్ నేత హత్య అనంతరం బొమ్మైకి అనేక చిక్కులు వచ్చాయి. ప్రభుత్వం సొంత ప్రజలను కాపాడుకోవటంలో… విఫలమైందని ప్రజల నుంచి పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ…రాష్ట్ర అధ్యక్షుడిని కానీ, సీఎం ను కానీ మార్చే ఆలోచన లేదని వారి నేతృత్వంలోనే 2023లో ఎన్నికలకు వెళ్తామని వెల్లడించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించలేకపోయింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసింది. ఏడాది తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కూలిపోవడంతో యడియూరప్ప సీఎం అయ్యారు. రెండు సంవత్సరముల తర్వాత 2021 జూలైలో బీజేపీ అధిష్టానం యడ్యూరప్పను మార్చి… బసవరాజ్ బొమ్మైని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. కర్ణాటక రాష్ట్రంలో 2023మే లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పులపై వస్తున్న వార్తలు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.