యంగెస్ట్ యాప్ డెవలపర్‌గా 12 ఏళ్లకే గిన్నెస్ రికార్డ్
అందరు ఆడుకునే వయస్సులో హరియాణాకు చెందిన 12 ఏళ్ల బాలుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని మరోసారి రుజువు చేశాడు కార్తీకేయ జఖర్. నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న జఖర్ , కేవలం యూట్యూబ్ వీడియోస్ ద్వారా మూడు లెర్నింగ్ యాప్‌లను తానే స్వయంగా తయారుచేశాడు. కొవిడ్ టైమ్‌లో అందరు పిల్లలు ఆటలకు… ఫోన్ లకు పరిమితమైతే ఇతను మాత్రం విటన్నింటికి భిన్నంగా ఆలోచించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు. తన తండ్రి తన అన్‌లైన్ చదువుల నిమిత్తం ఇచ్చిన ఫోన్ ద్వారా , యూట్యూబ్ వీడియోస్ చూస్తూ వీటిని రూపొందిచినట్టు తెలిపాడు. అంతే కాకుండా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్‌సీ డీగ్రీ పరీక్షలో అత్యున్నత మార్కులు సాధించి , స్కాలర్ షిప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
దీనిపై స్పందించిన కార్తీకేయ తండ్రి మాట్లాడుతూ… తన కొడుకు ఆన్‌లైన్ క్లాసెస్ సమయంలో స్క్రీన్ పాడవడం, ఫోన్ హ్యాంగ్ అవడం వంటి పలు సమస్యలు తలెత్తడంతో.. యాప్స్‌ని డెవలప్ చేశాడని జఖర్ తండ్రి అజిత్ చెప్పారు. అతి చిన్న వయస్సులోనే తమ కుమారుడు ఈ గిన్నెస్ రికార్డ్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జఖర్ మాట్లడుతూ కోడింగ్ చేస్తున్నప్పుడు తన మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయిందని … కొన్ని యూట్యూబ్ వీడియోస్‌తో ఈ సమస్యలను పరీక్షించి చదువు కొనసాగిస్తున్నాడన్నాడు.
ఈ నేపథ్యంలోనే జనరల్ నాలెడ్జి కోసం లూసెంట్ జి.కె ఆన్‌లైన్ , కోడింగ్ , గ్రాఫిక్స్ డిజైనింగ్ కోసం రామ్ కార్తిక్ లెర్నింగ్ సెంటర్ , శ్రీరామ్ కార్తీక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనే యాప్స్‌ను తయారు చేసినట్టు తెలిపాడు. దీని ద్వారా 45,000 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విట్టర్‌లో జఖర్‌ని అభినందించారు.