పేరు మార్పుతో ఎన్టీఆర్ స్థాయి తగ్గదు. వైఎస్సార్ స్థాయి పెరగదు-జూ.ఎన్టీఆర్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు రగడ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారింది. ప్రభుత్వాలు ఎన్నొచ్చినా… ఎవరు మారినా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ జోలికి ఇప్పటి వరకు వెళ్లలేదు. ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఏకైక సంస్థ కావడంతో ఎవరూ కూడా యూనివర్శిటీని ముట్టుకోలేదు. కానీ ఏపీలో జరుగుతున్న రాజకీయం ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీపైనా పడింది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులని ట్వీట్ చేశారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరిపేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని… ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరన్నారు ఎన్టీఆర్…

