ఇకపై జియో హాట్‌స్టార్
జియోలో డిస్నీ హాట్‌స్టార్‌ను విలీనం చేస్తారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఒక సవరణ. హాట్‌స్టార్ మెరుగైన ఇన్‌ప్రాస్ట్రక్చర్ కారణంగా జియో సినిమానే హాట్‌స్టార్‌లో విలీనం చేయాలనే నిర్ణయానికి రిలయెన్స్ వచ్చింది. జియో సినిమాకు గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉండగా, డిస్నీ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన సంస్థలు వయకామ్ 18, స్టార్ ఇండియా విలీనం జరుగుతున్న సందర్భంగా అవి నిర్వహిస్తున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను కూడా విలీనం చేయనున్నారు. స్పోర్ట్స్‌కు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు వేర్వేరు ఓటీటీలను కొనసాగించాలని రిలయెన్స్ ఆలోచిస్తుండడంతో ఇకపై మ్యాచ్‌లన్నీ హాట్‌స్టార్‌లోనే ప్రదర్శించబడతాయి.

