Breaking Newshome page sliderHome Page SliderTelangana

మంత్రి కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంత్రి కొండా సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.

ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కేసు తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారం, నటి సమంత విడాకులు వంటి సున్నితమైన అంశాలపై మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ కేటీఆర్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

విచారణలో భాగంగా కోర్టు BNS సెక్షన్ 356 కింద కేసును పరిగణనలోకి తీసుకుని, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా NBW జారీ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించాయి.