ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2022 ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థికవేత్తలకు — బెన్ ఎస్. బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్ మరియు ఫిలిప్ హెచ్. డయాపావిక్ నోబెల్ బహుమతి దక్కింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు వీరికి అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటనతో ఈ ఏడాది అవార్డులన్నీ ముగిశాయి. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రంలో విజేతలను నోబెల్ కమిటీ ప్రకటించింది. అనంతరం సాహిత్య రంగంలో విజేతను అక్టోబర్ 6న ప్రకటించారు. అక్టోబర్ 7న నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించారు.
నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.
శాంతి బహుమతి


 
							 
							