Home Page SliderTelangana

గణేష్ నిమజ్జనాలకు ‘నో ప్రాబ్లెమ్’..

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. 2021 నాటి హైకోర్టు తీర్పే అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. తీర్పు ఉల్లంఘనలు జరగలేదని, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు అభ్యంతరం లేదంది. కోర్టు దిక్కరణపై ఆధారాలు పిటిషనర్ చూపలేకపోయారని వెల్లడించింది. హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది వేణుమాధవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ చేస్తున్న హైడ్రాను సైతం మొత్తం వ్యవహారంలో ప్రతివాదిగా చేశారు. గతంలో కూడా హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేనప్పటికీ, సుప్రీం కోర్టు అనుమతితో నాడు శోభా యాత్ర, నిమజ్జనం జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పునే ఇప్పుడు కూడా హైకోర్టు బలపరిచింది.