InternationalNews

నోబాల్‌ సరైన నిర్ణయమే : సల్మాన్‌ భట్‌

ఇండియా మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు శ్రద్ధగా ఆడలేదని, వారికి రూల్స్‌ తెలియవని పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ విమర్శించాడు. కోహ్లీ పూర్తిగా ఆటలో నిమగ్నమై ఆడడం, అవకాశాన్నీ వినియోగించుకొని ఇండియాను గెలిపించాడని పొగడ్తలతో సల్మాన్‌ ముంచెత్తాడు. మ్యాచ్‌లో చివరి వరకూ విజయం ఇరుపక్షాల మధ్య ఉత్కంఠను రేకెత్తించింది. అంపైర్‌ ప్రకటించిన నోబాల్‌ సరైన నిర్ణయమే అని అన్నారు. ఫ్రీహిట్‌ సమయంలో రనౌట్‌, బంతిని చేతితో ఆపడం, ఫీల్డీండ్‌ను అడ్డుకోవడం వంటివి జరిగితేనే ఔట్‌. ఆ మ్యాచ్‌లో బంతి వికెట్లను తాకి వెళ్లింది. భారత ఆటగాళ్లు తెలివిగా రన్స్‌ చేశారు. పాక్‌ ఆటగాళ్లు అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు అని పేర్కొన్నాడు. కేవలం విరాట్‌తోనే  ఇండియా మ్యాచ్‌ గెలిచిందన్నాడు.