బీజేపీలోకి జయసుధ , జయప్రద
ఒకనాటి అందాల తారలు బీజేపీలోకి చేరతారని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమా రంగంలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారలు రాజకీయల్లోకి రావడం పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ తరపున ఎమేల్యేగా గెలిచిన జయసుధ , భర్త చనిపోయినప్పటి నుంచి నుంచి అటు సినిమాలకు , ఇటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

తాజాగా కొంతమంది రాజకీయ నేతలు వారిని సంప్రదించినట్టు సమాచారం. ఆమె మాత్రం ఏపీ బీజేపీలో కీలక పాత్ర ఆశిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జయప్రదకు ప్రాధాన్యత ఇవ్వలని కమలం పార్టీ ఆలోచిస్తున్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇంతకు ఇద్దరు ఓకే పార్టీకి పరిమితమవుతారా , లేదా వేర్వేరు పార్టీలలో చేరనున్నారా అనే అంశాలపై ఇంకా క్లారీటీ రావాల్సి ఉంది.
Read more : టార్గెట్ హైదరాబాద్