ఈ డ్రామాకు నితీశ్ ప్రధాన నటుడు
బీహార్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. పదేళ్లుగా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోందని.. అయితే ఈ అస్థిరతకు ప్రధాన కారణం బీహార్ ముఖ్యమంత్రినేనని అంటూ పీకే కామెంట్ చేశారు. గత కొన్నేళ్లుగా బీహార్‌లో పూర్తి స్థాయి ప్రభుత్వం నిలబడటం లేదని, 2012-13లో ఈ అస్థిరత ప్రారంభైమైందన్నారు. ఈ నాటకంలో నితీశ్ ప్రధాన నటుడు. ఆయన నిలకడలేనితనం వల్ల బిహార్‌కు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వేదికపై ఆయన నిలబడతారా లేదా.. కొన్నాళ్ళు వేచి చూద్దాం… ఒక బీహార్ పౌరుడిగా ఇంతకుమించి ఇంకేమీ ఆశించలేను. రాష్ట్రంలో కొన్నేళ్లుగా రెండు విషయాల్లో మార్పు జరగలేదు. ఒకటి సీఎంగా నితీశ్ మాత్రమే ఉన్నారు… మరోకటి బీహార్ ప్రజల అభివృద్ధిలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. గత ప్రభుత్వం నుంచి సుపరిపాలన ఆశించిన ప్రజలకు ఏమీ దక్కలేదు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందేనని పీకే తెలిపారు.