మరో రెండు సినిమాలకు ఓకే చెప్పిన నితిన్..?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ రిలీజ్‌కు సిద్ధమౌతున్నాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్షన్‌లో ‘తమ్ముడు’ అనే సినిమాలో నటిస్తున్న నితిన్.. మరో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ‘రాబిన్ హుడ్’ లోనూ నటిస్తున్నాడు. ఒక సినిమాను ఈ ఏడాది చివరినాటికి, మరో సినిమాను వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు నితిన్.
అయితే, రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడట నితిన్. ‘ఇష్క్’ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్‌తో నితిన్ తన తరువాత ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అలాగే ‘#90s’ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ రెండు సినిమాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తిచేయాలని నితిన్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నితిన్ నటించబోయే సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత కె.నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. మొత్తానికి నితిన్ వరుస ప్రాజెక్టులతో బిజీ అవబోతున్నాడు.

