Andhra PradeshNewsNews Alert

నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు

Share with

భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ఎగువ నుండి భారీగా వరదనీరు రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. ఇంతకు ముందే గత రెండు వారాల క్రిందట పూర్తి జలాశయం నిండగా, నీరు క్రిందికి విడుదల చేసారు. ఈ సీజన్‌లో రెండవసారి శ్రీశైలం క్రస్ట్ గేట్లు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే జలాశయానికి 2 లక్షలకు పైగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,21483  ఔట్ ఫ్లో : 64,170 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885.00  అడుగులు అయితే,  ప్రస్తుతం 883.30 అడుగులు నీటినిల్వ ఉంది.  జలాశయం  పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే  ప్రస్తుతం  206.0996 టీఎంసీలు ఉంది. నీటిపారుదల అధికారులు రేడియల్  గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  ఇప్పటికే జలాశయానికి 2 లక్షలపైన ఇన్ ఫ్లోగా వరద కొనసాగుతోంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టు నుండి కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,386 క్యూసెక్కులు, ఎడమ గట్టు ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.