NewsTelangana

HYDలో ఎన్‌ఐఏ తనిఖీలు

ఏపీ, తెలంగాణాలలో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. అదే సమయంలో హన్మకొండలోని చైతన్య మహిళ సంఘం కన్వీనర్ జ్యోతి ఇంటిలో ఎన్ఐఏ సోదాలు చేశారు. అదే విధంగా వైజాగ్‌లో కో కన్వీనర్ రాధ ఇంట్లోనూ ఈ సోదాలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ తనిఖీలు జరిపారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాల పై స్పష్టత రావాల్సిఉంది. ఆకస్మికంగా జరుగుతున్న ఈ తనిఖీలపై కొెందరు ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.