Andhra PradeshNews

నెక్స్ట్ ఇయర్ మోక్షజ్ఞ మూవీ… క్లారిటీ ఇచ్చిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య సంచలన ప్రకటన చేశారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలయ్య మోక్షజ్ఞ మూవీ అప్టేడ్స్ అందించారు. వచ్చే సంవత్సరం టాలీవుడ్‌లోకి తనయుడు ఎంట్రీ ఇస్తాడన్నారు. ఆ సినిమాకు బోయపాటి కథ సిద్ధం చేశారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో మూవీ ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది మాత్రం బాలయ్య చెప్పలేదు. అంతా దైవేచ్ఛ అంటూ సమాధానమిచ్చిన బాలయ్య.. కుమారుడి మూవీకి సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయ్. త్వరలోనే అఖండ 2 మూవీ ఉంటుందన్నారు బాలయ్య. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని… సమయం చూసి ప్రకటన ఉంటుందన్నారు.