Home Page SliderInternational

న్యూజీలాండ్ ప్రధాని జిసిందా అర్డెర్న్ రాజీనామా!

వచ్చే నెలలో తాను రాజీనామా చేయనున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ గురువారం ప్రకటించారు. నాకు ఇది తగిన సమయమంటూ లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో విషయాన్ని వెల్లడించారు. మరో నాలుగేళ్లు పాలన సాగించే సామర్థ్యం తన వద్ద లేదన్నారు. 2017లో సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయిన ఆర్డెర్న్, మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలలో వామపక్ష లేబర్ పార్టీ విజయం కోసం పనిచేశారు. ఇటీవలి ఎన్నికలలో ఆమె పార్టీ వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయింది. గత నెల పార్లమెంటు వేసవి విరామానికి వెళ్లే సమయంలో లేబర్ వార్షిక కాకస్ రిట్రీట్‌లో ఆమె రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. విరామ సమయంలో నాయకుడిగా కొనసాగడానికి శక్తిని పొందాలని ఆశించానని, కానీ అలా జరగలేదన్నారు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు అక్టోబర్ 14, శనివారం జరుగుతాయని, అప్పటి వరకు ఎంపీగా కొనసాగుతారని ఆర్డెర్న్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఎన్నికల్లో గెలవలేదని నమ్ముతున్నానన్నారు. అదే సమయంలో గట్టిగా ప్రయత్నిస్తే… గెలవొచ్చు… గెలుస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అర్డెర్న్ రాజీనామా ఫిబ్రవరి 7 తర్వాత అమల్లోకి వస్తుందని, జనవరి 22న లేబర్ కాకస్ కొత్త నాయకుడికి ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదన్నారు. తాను కూడా ఒక మనిషినేనన్న ఆమె… చేయగలిగినంత కాలమే చేయగలమన్నారు. ప్రస్తుత ఉప ప్రధాన మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ తన పేరును ముందుకు తీసుకురావడం లేదని చెప్పారు.