NewsTelangana

త్వరలో కొత్త సచివాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం త్వరలో ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సచివాలయాన్ని సంప్రదాయం, ఆధునీకతను మేళవించి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంబేడ్కర్‌ పేరు పెట్టిన సచివాలయాన్ని దసరా రోజున ప్రారంభిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ నిర్మాణాలను ఇప్పటికే పరిశీలించిన సీఎం కేసీఆర్‌ పలు కీలక మార్పులు సూచించినట్లు సమాచారం. ఈ నిర్మాణాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేపడుతున్నట్లు పార్టీ నాయకులు చెప్పారు.

అమర వీరుల స్మారకం, అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణాలూ త్వరలో పూర్తి

మరో రెండు మెగా ప్రాజెక్టులు.. అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం కూడా త్వరలో ప్రారంభమవుతాయని కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయమే ఉండటంతో ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను పూర్తి చేసి.. కొత్త సచివాలయం నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నిర్మాణాలు ప్రారంభమైతే హైదరాబాద్‌ ఖ్యాతి మరింత పెరుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.