ఏపీలో త్వరలో అమలుకానున్న కొత్త డిగ్రీ విధానం
ఏపీలో వచ్చే ఏడాది నుంచి డిగ్రీ విద్యా విధానంలో మార్పు రాబోతుంది. అదేంటంటే డిగ్రీలో ఇప్పటివరకు ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల స్థానంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటే ప్రధాన సబ్జెక్ట్‌గా ఉండనుంది. కాగా దీని ప్రకారమే కొత్త అడ్మిషన్లు జారీ చేయబడనున్నాయి. మారుతున్న పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ విధానానికి రూపకల్పన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సివుంది.

