NationalNews

ఫైనల్స్‌కు చేరిన నీరజ్ చోప్రా

Share with

అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌ఫిప్ 2022 లో నీరజ్ చోప్రా తన సత్తా చాటాడు. గ్రూప్- ఏ జావెలిన్ త్రో క్వాలిఫికీషన్ రౌండ్ మెదటి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్స్‌కి అడుగుపెట్టాడు. జావెలిన్ త్రోలో భారత్‌కు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మెదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.

ఇప్పటికే జరిగిన కామన్వెల్త్ గేమ్స , IAAF ప్రపంచ U20 ఛాంపియన్‌ఫిప్‌ ,  టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో పతకాలని గెలుచుకొని క్రీడారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నీరజ్. ఇక ఫైనల్స్  భారత కాలమానం ప్రకారం ఆదివారం జరగనుండగా , నీరజ్ తో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇప్పటి వరకు భరత్ కేవలం ఒకే ఒక పతకం మాత్రమే సాధించగా ,  అది కూడా 2003 పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్యం సాధించింది.