నయా నిజాం కేసీఆర్ మెడలు వంచేందుకే..
నయా నిజాం కేసీఆర్ మెడలు వంచేందుకే అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా మునుగోడు గడ్డపై అడుగు పెట్టారని రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ చెప్పారు. మునుగోడు లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నిన్న ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభ పేలవంగా ముగిసిందన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే ప్రజలంతా బీజేపీ వింటే ఉన్నారని ధీమా కలుగుతుందన్నారు. ప్రధాని మోడీ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనేక చర్యలు తీసుకుంటే కేసీఆర్ మునుగోడు సాక్షిగా అవాకులు చవాకులు పేలారని తీవ్రంగా విమర్శించారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ ప్రజలకు అందకుండా అడ్డుకున్న కేసీఆర్ ను బండకేసి బాదాలని తెలంగాణ ప్రజలను కోరారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు దళిత బంధు గుర్తొస్తుందని అభివృద్ధి గుర్తుకు వస్తుందని విమర్శించారు. కేసీఆర్ మెడల్ వచ్చేందుకు అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా వచ్చా రని ఆయనను ఆశీర్వదించాలని లక్ష్మణ్ కోరారు.