Andhra PradeshHome Page Slider

పర్వత శిఖరాలపై నవరత్నాల రెపరెపలు.. సీఎం జగన్ ఫోటో ప్రదర్శన

 17 ఏళ్ల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సురేష్ బాబు మౌంట్ మనస్లు, మౌంట్ లోట్సే శిఖరాలను అధిరోహించిన మొదటి దక్షిణ భారతీయుడుగా నిలిచారు. సీఎం జగన్ 3,648 సుదీర్ఘ పాదయాత్రకు ముగ్దుడైన సురేష్ బాబు సీఎం జగన్ స్పూర్తితో పర్వతారోహణను అభ్యాసంగా ఎంచుకున్నారు. ఇప్పటి వరకు 17 ఏళ్ల నుండి మొదలు పెట్టి  ఐదేళ్ల కాలంలో 25 పర్వతాలను అధిరోహించిన సురేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలను సంబంధించిన పోస్టర్లను పర్వతాలపై ప్రదర్శించారు. దీనితో ఈయనకు వైఎస్సార్ సీపీ కర్నూల్ ఎంపీ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ ప్రభుత్వం నుంచి సురేష్ కుమార్ కు మరింత సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు సిఫారసు చేస్తామన్నారు.

సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలతో తన జీవితంలో ఎంతో భరోసా వచ్చిందని, తన కుటుంబ ప్రాథమిక సమస్యలు తొలగిపోయాయని పర్వతారోహకుడు సరేష్ బాబు ఈ సందర్భంగా వివరించారు. సీఎం జగన్ స్పూర్తిగా సాగిన పర్వతారోహణపై సీఎం జగన్ ను ప్రత్యక్షంగా కలిసి చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరారు. తాను సాధించిన ఘనత సీఎం జగన్ కు తెలిసిందని చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.