నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ మేరకు ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.అయితే వీటికి 2013 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించిన వారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.కాగా దీనికి వచ్చే ఏడాది జనవరి 18న ఆన్‌లైన్‌లో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.అయితే ఈ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.

