Home Page SliderTelangana

నల్గొండ బరిలో జానారెడ్డి, భువనగిరి బరిలో పటేల్ రమేష్ రెడ్డి!?

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమై.. చివరి నిమిషంలో టికెట్ కోల్పోయిన రమేష్ రెడ్డికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ చేస్తామని పార్టీ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడం, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కావడంతో ఎంపీగా బరిలో దిగేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. భువనగిరి రేసులో పటేల్ రమేష్ రెడ్డి ముందంజలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత కుందూరు జానారెడ్డి సైతం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయన దీనిపై మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీంతో జానారెడ్డి ఢిల్లీ వెళ్లి పెద్దల నుంచి లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కర్నాటక, తెలంగాణలో ఎక్కువ సీట్లను గెలుచుకోవడంపై పార్టీ ఫోకస్ పెడుతోంది. అటు నల్గొండ, ఇటు భువనగిరిలో వరుసగా సూర్యాపేట, జనగాం నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా, మిగతా 12 స్థానాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇద్దరు నేతల పోటీపై మరిన్ని కథనాల కోసం మన సర్కార్ చూస్తూ ఉండండి.