వరదల్లో చిక్కుకున్న నాగార్జున
సినీ హీరో అక్కినేని నాగార్జున అనంతపురం జిల్లా వరదల్లో చిక్కుకున్నాడు. అనంతపురం లోని కళ్యాణ్ జ్యువెలర్స్ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం హైదరాబాద్ నుంచి విమానంలో పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకునేందుకు కారులో బయలుదేరారు. కానీ ధర్మవరం నుంచి అనంతపూర్ కు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండంతో హైవే మధ్యలో ఇరుక్కుపోయారు. సత్యసాయి జిల్లా పోలీసులు నాగార్జునను అనంతపురంకి క్షేమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

