NationalNews

అమెరికాలో చరిత్ర సృష్టించిన నబీలా సయ్యద్

23 ఏళ్లకే ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నిక
అతి తక్కువ వయసులో ఎన్నికై రికార్డు
అమెరికా మధ్యంతర ఎన్నికలలో కొత్త చరిత్ర
రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్ బాస్‌ను ఓడించిన నబీలా

ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన US మధ్యంతర ఎన్నికలలో, 23 ఏళ్ల భారతీయ-అమెరికన్ తన రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్ బాస్‌ను ఓడించింది. ఇల్లినాయిస్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 51వ జిల్లాకు జరిగిన ఎన్నికలలో ఆమెకు 52.3% ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నబీలా సయ్యద్ ఇలా ఉత్సాహాన్ని పంచుకున్నారు. “నా పేరు నబీలా సయ్యద్. నేను 23 ఏళ్ల ముస్లిం, భారతీయ-అమెరికన్ మహిళ. మేము రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న సబర్బన్ జిల్లాలో విజయం సాధించాం. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిని.” అంటూ ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చారు. తన రాజకీయ జీవితం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు నబీలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రతినిధిగా ప్రకటించినప్పుడు, ప్రజలతో నిజాయితీగా సంభాషణలో పాల్గొన్నానన్నారు.

ప్రజాస్వామ్యం వ్యవస్థలో భాగస్వామికావడం… ఆనందంగా ఉందన్న నబీలా… విలువలకు ప్రాతినిధ్యం వహించం కోసం నాయకత్వం వహిస్తున్నానన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం ద్వారానే ఎన్నికల్లో గెలిచామన్నారు నబీలా. ఎన్నికల్లో తనకు మద్దతిచ్చినవారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి డోర్‌కు వెళ్లి ప్రచారం చేశానన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పడానికి నేను వారి వద్దకు వెళ్తానన్నారు. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నబీలా ఎన్నికల్లో గెలవడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్. యువత ముందుకు వస్తున్నందుకు గర్విస్తున్నామంటూ మేసేజ్‌లు పోటెత్తాయి. గొప్ప అవకాశం.. గొప్ప గొప్ప పనులు చేసి చరస్మరణీయులకండంటూ ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్. నబీ మీరెప్పుడూ ఒంటరి కాదని… మీతో మేమందరం ఉన్నామంటూ మరికొందరు సందేశాలు పంపించారు. నబీలా సయ్యద్ బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.