NationalNews

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ లేఖ

Share with

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్ తో కలిసి పనిచేయడం అపూర్వమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నిన్ననే పదవి విరమణ చేసిన రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన లేఖ రాశారు. విలువలు, మంచితనం, సున్నితత్వం, సేవ గుణాల మేలవింపుగా రాష్ట్రపతి వ్యవహరించారని కితాబిచ్చారు. యూపీలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి రాష్ట్రపతి పదవి వరకు రావడం సామాన్యమైన విషయం కాదన్న మోదీ… దేశ అభివృద్ధికి అది కీలక ఘట్టమన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎంతో గొప్పగా వ్యవహరించారని అభినందించారు. రాజ్యాంగ సూత్రాలపై గౌరవం అసమానమన్నారు. ఎన్నోసార్లు ముఖ్య విషయాలపై సూచనలు.. సలహాల కోసం సంప్రదించినప్పుడు ఎంతో అవగాహన కల్పించారన్న మోదీ… ఇకపైనా సంప్రదిస్తుంటానని చెప్పారు. కోవింద్ తన నివాసాన్ని పేదలకు ఇవ్వడం ఎంతో గొప్పవిషయమన్నారు.