మోదీజీపై ప్రశంసల వర్షం కురిపించిన మస్క్ -త్వరలో భారత్‌లో టెస్లా అడుగు
ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మోదీని కలుసుకున్నారు. తాను మోదీజీకి పెద్ద ఫ్యాన్‌నని తెలియజేశారు. ఆయన పనితీరుకి, నాయకత్వానికి ఫిదా అయిపోయానని పేర్కొన్నాడు. ఈ భేటీలో భారత్‌లో పెట్టుబడులు పెట్టమని మోదీ కోరగా, వెంటనే అంగీకరించారు మస్క్. త్వరలోనే భారత్‌లో పర్యటిస్తానని, టెస్లా కంపెనీని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు మస్క్. మోదీకి భారత్‌పై ఎంతో బాధ్యత, శ్రద్ద ఉన్నాయన్నారు. ఆయనతో సమావేశం కావడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మోదీ కూడా మస్క్‌తో సమావేశం బాగా చక్కగా జరిగిందని, ఇంధనం నుండి ఆధ్యాత్మికత వరకు అనేక విషయాలపై చర్చించామని పేర్కొన్నారు.

