మున్సిపల్ కమిషనర్ వినూత్న ఆలోచన
భైంసా మున్సిపల్ కమిషనర్ రాజేశ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏ ఘనకార్యం చేశాడని షాక్ అవుతున్నారా..? సాధారణంగా మంచి సూక్తులు, కొటేషన్స్ పాఠశాలలు, వాహనాలు, ఆయా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై రాసి ఉండడం చూస్తూ ఉంటాం. కానీ ఇందుకు భిన్నంగా పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో తన పేరు, హోదా తెలిపే టేబుల్ బోర్డుపై ‘సమయం చాలా విలువైనది.. దయచేసి ఇతరులకు అవకాశం ఇవ్వండి’ అని రాసి ఉండటం అందరినీ ఆకర్శిస్తోంది. ఇలాంటి వినూత్న ఆలోచనతో మున్సిపల్ కమిషనర్ రాజేశ్ తన డ్యూటీని కొనసాగిస్తున్నారు.

