ఎంపీ వీడియో ఫేక్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికేంతవరకు నిజనిజాలు తెలియవని, పోస్టు చేసిన వ్యక్తి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో స్పష్టమైన ఆధారాలు లభించడం లేదని ఎస్పీ పేర్కొన్నారు. వైరల్ అయిన వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
మార్ఫింగ్ వీడియోను మొదట ఈనెల 4న ఐ టీడీపీ అఫిషియల్ అనే వాట్సాప్ గ్రూప్‌లో +447443703968 అనే నెంబర్‌తో యూకే నుంచి పోస్టు చేశారని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పలుసార్లు ఫార్వర్డ్, రిపోస్టు చేయడం జరిగిందని, ఇలా అనేకసార్లు చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నామని ఎస్పీ తెలిపారు.
ఫేక్ వీడియో అని మొదలే చెప్పాను : ఎంపీ గోరంట్ల
తనపై సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ వీడియో అని ఆరోజే చెప్పానని ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి టీడీపీ కుట్ర చేశారని ఎంపీ గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.