నూతన సీజేఐగా జస్టిస్ యు.యు.లలిత్
భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో 49వ సీజేఐగా జస్టిస్ యు. యు. లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్ లలిత్ పదవీ కాలం కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది. నవంబర్ 8న ఆయన రిటైర్ కానున్నారు.

1957 నవంబర్ 9న జస్టిస్ యు.యు. లలిత్ జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985 డిసెంబర్ వరకు బొంబాయి హైకోర్టులో పనిచేశారాయన. 1986 జనవరి నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు మొదలు పెట్టారు. 2014 ఆగస్టు 13న యు.యు. లలిత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ట్రిపుల్ తలాక్‌తోపాటు అనేక కీలక తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.